- Advertisement -
వయసు నూరేళ్లు… ఖరీదు 35 లక్షలు*
Age 100 years... Cost 35 Lakhs*
కడియం నర్సరీలో వింతైన రూపంతో ఆకర్షిస్తున్న విదేశీ చెట్టు. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ లకు ఇప్పటివరకు అనేక రకాల విదేశీ మొక్కలు దిగుమతి అయ్యాయి. అవి ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చాయి. తాజాగా కడియపులంక శివాంజ నేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు కొద్ది రోజుల క్రితం వింత ఆకారాలతో తీసుకొచ్చిన చెట్లు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ అమెరికాలో విరివిగా ఉండే వీటిని స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయిస్తున్నారు. పెద్ద పార్కులు, హోటళ్లు, గార్డెన్స్లో ప్రత్యేక అలంకరణగా వీటిని పెంచుతారు. వయసు 100 నుంచి 120 ఏళ్లు ఉంటుంది. ఒక్కో చెట్టు ఖరీదు రూ.35 నుంచి రూ.40 లక్షలు ఉంటుంది. ఈ చెట్లను భారీ కంటైనర్లలో తీసుకొచ్చారు. ప్రస్తుతం మోడుగా ఉన్న వీటికి కొమ్మలు వచ్చి రంగురంగుల పూలు పూస్తాయని పోలరాజు తెలిపారు. ‘సిల్క్ ఫ్లోస్’ ట్రీ’గా పిలువబడే ఈ చెట్టు శాస్త్రీయ నామం ‘కొరిసియా స్పెసియోసా’. ఇవి కడియం నర్సరీలతో పాటు హైదరాబాద్ సమీపంలోని 150 ఎకరాల పార్కులో ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళాలంటే 1800రూపాయల టికెట్ తీసుకోవాలిట.
- Advertisement -