
పరీక్షల సమయం కావటం తో రంగా రెడ్డి జిల్లాలోని పలు కాలేజ్ లలోని విద్యార్థులతో మాట్లాడిన అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక విద్యార్థులకు పలు సూచనలు సలహాలు అందించారు ఎలాంటి పరీక్ష ఐన వొత్తిడి కి లోనవొద్దని,మనం చదవడమే కాకుండా.. మన మనసులో వాటికి దృశ్య రూపం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని దీనినే మైండ్ మ్యాపింగ్ అంటారని .. చదివిన అంశాలను కొన్ని గుర్తులు, బొమ్మల ద్వారా గుర్తుపెట్టుకుంటే అవి చాలా రోజులు గుర్తుంటాయనీ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌కి ఇవి బాగా ఉపయోగపడతాయని అలా చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు…
పరీక్షల సమయంలో పూర్తిగా భయాన్ని వదిలేసి. హ్యాపీగా చదివి, పరీక్షలు రాయాలని. దీంతో పాటు అయిపోయిన పరీక్షలో సరిగ్గా రాయకపోతే దాని గురించి ఎక్కువగా బాధపడి ఎలాంటి చెడు ఆలోచనలు మైండ్ లోకి రానివ్వకుండా తమ తల్లితండ్రులను గుర్తు చేసుకోవాలని అన్నారు…
🖋️ సన్నీ కుమార్ రాపాక (ఫౌండర్ అండ్ చైర్మన్ అక్షిత ఫౌండేషన్)