సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణం
భక్తుల తో కిక్కిరిస్తున్న మేడారం
నిండి పోయిన క్యూ లైన్ లు
అమ్మవారి సేవలో వివిధ శాఖల అధికారులు
ములుగు
తలుచుకుంటేనే కరుణించే తల్లులు సమ్మక్క సారాలమ్మా లు… అట్లాంటి తల్లుల దర్శనం కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు .అమ్మవార్లు ఎప్పుడు గద్దె లకు వస్తారా అని వేచి చూస్తున్న భక్తులు ఎంతో మంది ఈరోజు సాయంత్రం సారాలమ్మా గద్దె మీదకు రానున్న నేపథ్యంలో…మేడారంకి భక్తుల తాకిడి పెరిగింది.వేకువజామున నుండే భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిట లాడుతున్నాయి. క్యూ లైన్ లన్ని నిండి పోయాయి.వన దేవతల రాక సందర్భంగా సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది.గద్దెల వద్ద ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు గద్దెల వద్ద అమ్మవారి సేవలో తరించిపోతున్నారు.గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని సానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు.
సారాలమ్మ రాక కి అన్నీ ఏర్పాట్లు పూర్తి
- Advertisement -
- Advertisement -