- Advertisement -
దేశం విశిష్ఠ వ్యక్తిని కోల్పోయింఆది–మంత్రి పొంగులేటి
The country has lost a great man -- Minister Ponguleti
ఖమ్మం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాయలంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ హోదాల్లో దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
మంత్రి మాట్లాడుతూ దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన పంజాబ్ లో జన్మించగా, అనారోగ్యంతో బాధపడుతూ 2024 డిసెంబర్ 26వ తేదీన మృతి చెందారు. 2004 – 2014వరకు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 1991 అక్టోబర్ నుంచి 2019 జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా, 2019 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆర్థిక వేత్తగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేశారు. ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయంలోనే నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం – అమెరికా పౌర అణు ఒప్పందం పై సంతకం చేశారు. దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారు. అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకు వచ్చింది కూడా మన్మోహన్ సింగే. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయంలో ఆధార్ పథకం ప్రారంభించారు. ఇప్పుడు అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే అయిందని అన్నారు.
- Advertisement -