Saturday, February 15, 2025

అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం రెండవ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

- Advertisement -

అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం రెండవ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

All India Dalit Rights Movement Win the Second National Congress.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  బాల నరసింహ.

హిమాయత్ నగర్
దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్యా వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖారావం పూరించడానికి 2025 జనవరి 5 6 7 తేదీలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ హైదరాబాద్ నగరంలో జరిగే అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం రెండవ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహా గారు పిలుపునిచ్చారు.
శనివారం రోజున నారాయణగూడలోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమితి సమావేశానికి ముఖ్య అతిధులుగా బాలు నరసింహ గారు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు దళితుల అభివృద్ధి పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నేటికీ దళితులకు పరిమితంగానే విద్యా ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని కొంతమేరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దళితులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికెవి కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం లోకి వచ్చాక ప్రైవేటీకరణ సరళీకరణ ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేయడం మూలంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా దళితుల అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిలిపివేసి ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు అమలకు పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టాలని ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు రిజర్వేషన్లు అమలు చేయబడవు ఫలితంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.
నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సేవలు ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ వేగవంతం కావడానికి తోడు ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ లేకపోవడం వలన ఉపాధి ఉద్యోగ అవకాశాలు దళితులకు వాటా దక్కడం లేదని రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాప్తంగా దళితులకు ఆర్థిక రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం కొరకు కుల వివక్షత కుల నిర్మూలన కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించుటకు భవిష్యత్తు కార్యాచరను రూపొందించుకొని దేశవ్యాప్తంగా నిర్మాణ ప్రతిష్టతను పెంపొందించుకోవడానికి 2025 జనవరి 5 6 7 తేదీలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ హైదరాబాదులో అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం ఏఐడీఆర్ఎం రెండవ జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నామని ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని ఈ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామని కావున డిహెచ్పిఎస్ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని బాల నరసింహా గారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్,సలింగటి శ్రీనివాస్, ఏ రాజు,వై ఉష, జే కుమార్, కె సహదేవ్,లావణ్య ,బద్రయ్య,ఎర్రల రాజయ్య, మద్దెల దినేష్, తో పాటు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్