Wednesday, February 19, 2025

టెన్త్ పరీక్షలకు అంతా సిద్దం

- Advertisement -

టెన్త్ పరీక్షలకు అంతా సిద్దం

All ready for Tenth Exams

సర్కారీ స్కూళ్లలో అడిషనల్ క్లాసులు
వరంగల్, జనవరి 30, (వాయిస్ టుడే)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వారికి సాయంత్రం వేళల్లో స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 20 వరకు సాయంత్రం వేళల్లో పిల్లలకు స్నాక్స్ ఇస్తారు. దాదాపు 38 రోజుల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది. పరీక్షల వేళ పిల్లలకు స్టడీ అవర్స్ ఉంటాయి. సాయంత్రం ఇంటికి వెళ్లి స్నాక్స్ తినే టైంలో స్కూల్‌లో ఉంటున్నారు. అందుకే వారికి స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెనూ ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. దీన్ని కూడా మధ్యాహ్నం భోజనం వండే  వాళ్లకే ఇస్తారా లేకుంటే పూర్తి బాధ్యత ఉపాధ్యాయులకే అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది.  మార్చి 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.  రోజూ ఉదయం 9.30 కి మొదలయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12.30కి ముగుస్తాయి. ఈ పరీక్షల్లో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేర్పు చేసింది. గ్రేడింగ్ విధానంతోపాటు ఇంటర్నల్ మార్కుల పద్ధతిని కూడా తీసిపారేసింది. అంటే ఈసారి జరిగే పరీక్షలు పూర్తిగా వంద మార్కులకు జరగనున్నాయి.  మరో వైపు  తెలంగాణలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్రీ-ఫైన‌ల్ ప‌రీక్షల తేదీల‌ను పాఠశాల విద్యాశాఖ ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు జనవరి 23న ప‌రీక్షల షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకాకం విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీ-ఫైన‌ల్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 15తో పరీక్షలు ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మ‌ధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు కొన‌సాగ‌నున్నాయి. అయితే ఫిజిక‌ల్ సైన్స్, బ‌యోలాజిక‌ల్ సైన్స్ ప‌రీక్షల‌ను మాత్రం గంట‌న్నర వ్యవ‌ధిలోనే నిర్వహించ‌నున్నారు. ఇక పదోతరగతి వార్షిక ప‌రీక్షల‌ను మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వ‌ర‌కు నిర్వహించ‌నున్న సంగతి తెలిసిందే.
ప్రీ ఫైన‌ల్ ప‌రీక్షల తేదీలివే..
➥ మార్చి 6: ఫ‌స్ట్ లాంగ్వేజ్
➥మార్చి 7: సెకండ్ లాంగ్వేజ్
➥ మార్చి 10: థ‌ర్డ్ లాంగ్వేజ్
➥ మార్చి 11: మ్యాథ‌మేటిక్స్
➥ మార్చి 12: ఫిజిక‌ల్ సైన్స్
➥ మార్చి 13: బ‌యోలాజిక్ సైన్స్
➥ మార్చి 15: సోష‌ల్ స్టడీస్
మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు
రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలును ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 26న మ్యాథమెటిక్స్, మార్చి 28న ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయలాజికల్ సైన్స్,  ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 3న  ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 4న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 24న ఇంగ్లిష్
మార్చి 26న మ్యాథమెటిక్స్
మార్చి 28న ఫిజికల్‌ సైన్స్‌
మార్చి 29న బయోలాజికల్ సైన్స్
ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.
ఏప్రిల్ 3న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు థియరీ పరీక్ష.
ఏప్రిల్ 4న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్