ఈ నెల 4న కరీంనగర్‌కు అమిత్‌ షా…ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్‌

- Advertisement -

ఈ నెల 4న కరీంనగర్‌కు అమిత్‌ షా

ప్రతిమ మెడికల్‌ కాలేజీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు హాజరు

డీమ్డ్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన.. ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్‌

Amit Shah to visit Karimnagar on the 4th of this month; Bandi Sanjay inspects arrangements.

కరీంనగర్, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): ప్రతిమ మెడికల్‌ కాలేజీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్‌ 4న నిర్వహించనున్న సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ డీమ్డ్‌ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ప్రతిమ మెడికల్‌ కాలేజీని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కళాశాల యాజమాన్య ప్రతినిధులు బోయినిపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని వికాస్‌ రావు, కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌ రావుతో కలిసి హెలిప్యాడ్‌, పైలాన్‌ ఆవిష్కరణ ప్రాంతం, ఫొటో ఎగ్జిబిషన్‌, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం ప్రతిమ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవానికి నాటి కేంద్ర హోంమంత్రి ఎల్‌.కె. అద్వానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నాటి కేంద్ర సహాయ మంత్రి సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు హాజరైన విషయాన్ని గుర్తుచేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో అమిత్‌ షా పాల్గొని డీమ్డ్‌ యూనివర్సిటీ పైలాన్‌ను ఆవిష్కరించడంతోపాటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.

అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌

అక్టోబర్‌ 3: రాత్రి 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో బస.

అక్టోబర్‌ 4: ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చేరుకుని సబర్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌ మిల్క్‌ ప్లాంట్‌ ప్రారంభం.

మధ్యాహ్నం 2 గంటలకు: తూప్రాన్‌ నుంచి కరీంనగర్‌ ప్రతిమ మెడికల్‌ కాలేజీకి చేరుకుని సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.

సాయంత్రం 4.30 గంటలకు: కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular