- Advertisement -
త్వరలో రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
హైదరాబాద్ ఫిబ్రవరి 20
బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి 35 శాతం ఓట్లు సాధించాలని స్థానిక నాయకత్వానికి అమిత్ షా టార్గెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -