Monday, March 24, 2025

కమలంలో పీక్స్ కు చేరిన  అంతర్గత పోరు…

- Advertisement -

కమలంలో పీక్స్ కు చేరిన  అంతర్గత పోరు…
హైదరాబాద్, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే )

An internal battle that reached peaks in Kamal...

తెలంగాణ బీజేపీలో మళ్లీ రచ్చ మొదలైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీలో సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల నియామకంపై విమర్శలు…పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మొదటి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన కాషాయ పార్టీ… రెండో విడతలో నలుగురు పేర్లు ప్రకటించింది. దీంతో అధ్యక్షుల సంఖ్య 23కి చేరింది. మిగిలిన జిల్లాల్లో అధ్యక్ష ఎంపికను పెండింగ్‌లో పెట్టి ఊరిస్తూ వస్తోంది. అయితే అధ్యక్షుల ప్రకటనలో ఊరిస్తోందా.. లేక అనుకున్న వారికి ఇచ్చేందుకు యత్నాలా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో… ఆ వాదనలకు ఆజ్యం పోసినట్లు అయ్యిందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయిమహిళలకే పెద్దపీట వేస్తామంటూ ప్రేమ ఒలకబోసిన కమలం పార్టీ..ఇప్పటి వరకూ ప్రకటించిన 23 జిల్లాల అధ్యక్షుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చి..విమర్శలపాలవుతోంది. సంగారెడ్డి జిల్లా మినహాయిస్తే… హేమా హేమీలున్న జిల్లాలోనూ మహిళలకు.. ఒక్కరంటే.. ఒక్కరికీ కూడా అవకాశం ఇవ్వకపోవడంతో మహిళా నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. అంతేకాదు… పార్టీలో పనిచేసే వారికి కాకుండా… ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా ముందు నుంచే వినిపిస్తున్నాయి.సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. గ్రామీణ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నామని చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా నేతల తీరు కనిపిస్తోందని సొంత పార్టీలో చర్చ జరుగుతోందట. ఇప్పటికే.. బూత్, మండల స్థాయిలో కమిటీలను సైతం ఏర్పాటు చేశామని.. అందులో భాగంగానే ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తున్నామని రాష్ట్రనాయకత్వం చెబుతున్న మాట. ఇప్పటికే 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని చెబుతున్న కాషాయ పార్టీ.. చెబుతున్న లెక్కలకు.. చేసే పనులకు పొంతన లేకుండా వ్యవహరిస్తోందని.. సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. తాజాగా మరో నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించడంతో మళ్లీ రచ్చ మొదలైందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ వంతు వచ్చింది. ప్రకటించిన నాలుగు జిల్లాల్లో గోల్కొండ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు నియామకం అంశంలో.. ఆయన రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఎడాపెడా ఉతికి ఆరేశారట. ఎంఐఎం, బీఆర్ ఎస్ తో కుమ్మక్కై తిరిగిన.. ఉమా మహేంద్రకు… అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారంటూ మండిపడ్డారట. ఇప్పటికే అధ్యక్షులను ప్రకటించిన జిల్లాల్లో… మెజారిటీ జిల్లాల్లో అసంతృప్తి…. పీక్ స్టేజీలో ఉన్న నేపథ్యంలో రాజాసింగ్ చేసిన కామెంట్స్.. హాట్‌గా మారాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలే.. ఎంపిక విషయంలో ఇబ్బందుల్లో ఉన్న అధిష్టానానికి… రాజాసింగ్‌ లాంటి వ్యక్తి ప్రశ్నలతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందంటూ ప్రచారం సాగుతోంది.తెలంగాణ బీజేపీ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు. ఆ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులను తనదైన శైలిలో ఇరకాటంలో పెట్టే వ్యక్తిగా రాజాసింగ్‌కు ఫాలోయింగ్‌ కూడా ఉంది. అలాంటి వ్యక్తి.. సొంతపార్టీపై చేసిన హాట్‌ కామెంట్స్‌.. రాష్ట్ర నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారాయనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ అంటే..ఒక మతానికి ఫైర్ బ్రాండ్‌గా చెబుతుంటారు. బీజేపీకి సంబంధించిన హిందువులు… ఆయన్ను అమితంగా ఇష్టపడుతారు. అలాంటి నేతకు.. ఇప్పుడు పార్టీలో ఆదరణ కరువైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా రాజాసింగ్ కనిపించకపోవటంతో… వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరునట్లు అవుతోంది.ఇక్కడే.. అసలైన ట్విస్ట్‌ ఉంది. నిజంగానే పార్టీ నేతలు… రాజాసింగ్‌ను దూరం పెడుతున్నారా.. లేక పార్టీ వ్యవహారాలు నచ్చక ఆయనే దూరంగా ఉంటున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఉన్న ఫలంగా మరోసారి.. రాజాసింగ్ సొంత పార్టీపై సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో… ఆ పార్టీలో సంస్థాగతంగా ఏం జరుగుతోందో తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి పార్టీ శ్రేణులు వెళ్లారనే టాక్ బలంగా వినిపిస్తోందిజిల్లాల అధ్యక్షుల నియామక అంశంలో… ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వారి వారి నియోజకవర్గాలలో కొందరి పేర్లు ప్రతిపాదిస్తూ వారికే అధ్యక్ష పదవులు ఇవ్వాలని అధిష్టానానికి సూచనలు చేశారట. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన నియోజకవర్గంలోని గోల్కొండ జిల్లాకు ఎస్సీ లేదా బీసీ నేతని జిల్లా అధ్యక్షుడుగా నియమించాలని అధిష్టానానికి సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. కానీ.. ఎంఐఎం, బీఆర్ఎస్ తో తిరిగిన ఉమా మహేందర్‌క అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాదు.. రెండు రోజులు పార్టీ నాయకత్వానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఈలోగా అధ్యక్షుడి అంశంలో పార్టీ నిర్ణయం మార్చుకోకపోతే .. తామేంటో చూపిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారట.గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ ఆడియో రిలీజ్ చేశారు. అందులో.. తనపై ఎంత కుట్ర కోణం దాగి ఉందో తెలుస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. అధిష్టానానికి మాతో పని లేధని అనుకుంటున్నారా..? మాతో అవసరం లేదని అనుకుంటున్నారా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసేశారు. హిందూ ధర్మాన్ని ఆచరించడం నేర్చుకున్నాను తప్ప… కొంతమంది చేస్తున్నట్టుగా బ్రోకరిజాన్ని నేర్చుకోలేదనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ ధర్మం కాని బ్రోకరిజం వల్లే…… తెలంగాణలో ఎప్పుడో అధికారంలోకి రావాల్సిన పార్టీ వెనుకబడిపోయిందనేది రాజాసింగ్ వాదనగా తెలుస్తోంది. కొంతమంది ఉన్నంతకాలం.. తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు రాజాసింగ్‌. అవసరమైతే… పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. తమకు పదవులు ముఖ్యం కాదంటూ.. పార్టీ నాయకత్వానికి చురకలు అంటించారు రాజాసింగ్‌.గత అసెంబ్లీ ఎన్నికల్లో.. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కమలదళం ఎన్నికలకు వెళ్లింది. మిషన్-90 లక్ష్యంతో.. 90 స్థానాలు సాధిస్తామని చెప్పుకొచ్చిన కమలం నేతలు…తొమ్మిది సీట్లు కూడా సాధించలేకపోయారు. అదే అంశంపైనా రాజాసింగ్ ఫైనల్ టచ్ కూడా ఇచ్చేపారేశారు. తన బ్రాడ్ కాస్టింగ్ మీడియా గ్రూపులో.. పార్టీని, పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ మెసేజ్ రిలీజ్ చేశారు. పార్టీలో బీసీ నినాదంపైనా రాజాసింగ్ గట్టిగానే విమర్శలు చేశారు. బీసీల పార్టీ అంటారు. బీసీ ముఖ్యమంత్రి అంటారు.. కానీ…స్టేట్ అధ్యక్షుడు, బీజేపీఎల్పీ ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వేరే కులస్తులను నియమించారని.. ఇంకెక్కడి బీసీలంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు.. కాంట్రవర్రీగా మారాయట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.జిల్లాల అధ్యక్షుల నియామకం కావొచ్చు.. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యత అంశంలో కావొచ్చు… రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బిజెపి అధిష్టానం ఎలా తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది. తన అవసరం పార్టీకి లేదా.. పార్టీ నుంచి వెళ్లమంటే …ఈ క్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రనాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందే చర్చ సాగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్