Friday, December 27, 2024

దేవీ లక్ష్మీ నరసయ్య సేవా ప్రయాణంలో మరో మైలురాయి…

- Advertisement -

దేవీ లక్ష్మీ నరసయ్య సేవా ప్రయాణంలో మరో మైలురాయి…

– ఆయన సేవలకు దక్కిన అరుదైన గౌరవం..

– డాక్టరేట్ ప్రధానం చేసిన హెచ్ ఎస్ సి టైం పాస్ సమోసా విశ్వ విద్యాలయం…

కమాన్ పూర్
మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజికవేత్త, దళిత రత్న, బెస్ట్ లీడర్ షిప్ ఇలా ఎన్నో అవార్డులకు, రివార్డులకు సుపరిచితుడైన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన దేవీ లక్ష్మీ నరసయ్య కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సేవా ప్రయాణం మరో మైలురాయికి చేరుకుంది. ఈ మేరకు హైదరాబాదులో గురువారం హెచ్ ఎస్ సి యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అందుకున్న దేవి లక్ష్మీనరసయ్య విశిష్టత గురించి…. 1992లో పోలీసు ఉద్యోగంలో చేరిన ఆయన అప్పటినుంచి తన సేవ ప్రయాణం ప్రారంభించాడు. తనకు వచ్చే నెలసరి జీవితంలో 10 శాతం పేద విద్యార్థులకు ఖర్చు చేశాడు. నిరుపేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వడం, నోట్ బుక్స్, దుస్తులు సమకూర్చడం వంటివి చేశాడు. అక్కడితో ఆగకుండానే ఇక సమాజ హిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన ఇప్పటివరకు 62 సార్లు రక్తదానం చేసి రక్తదాత ప్రాణదాత అవార్డులను కూడా అందుకున్నారు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో తన వంతు పాత్ర పోషించి 1992లో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కాలంలోనే వృక్షమిత్ర అవార్డును అందుకున్నారు. తాను చదువుకున్న పాఠశాలలోనే మొక్కలు నాటి అవి చెట్లుగా ఎదగెందుకు సంరక్షణ బాధ్యత తీసుకొని సఫలీకృతుడయ్యాడు. ఇక వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా పారిశ్రామిక ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ను  ముందుకు తీసుకు వెళ్లడంలో వరంగల్, హుజురాబాద్, కాగజ్ నగర్, కన్నాల తదితర మారుమూల ప్రాంతాలకు వెళ్లి అంబేద్కర్ ఇజంపై అవగాహన కల్పించారు. ప్రధానంగా కరోనా విపత్తు సంభవించిన సమయంలో కరోనా బాధితుల వద్దకు వెళ్లి పౌష్టికాహారం, మందుల ఖర్చులకోసం ఆర్థిక సహాయం చేయడంతో అప్పుడు కరోనా వారియర్  అవార్డు కూడా లభించింది. ఇక ఆటో డ్రైవర్లకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు పేద విద్యార్థుల కోసం సాయి ప్రేమ మందిర్ స్థాపించినప్పుడు తన జీవితంలో నుంచి కొంత మొత్తం వారికే కేటాయించారు. పోలీస్ కానిస్టేబుల్ గా తన వృత్తి ధర్మాన్ని సమర్థవంతమందంగా నెరవేర్చడంలో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసలు అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఢిల్లీలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా బెస్ట్ లీడర్ షిప్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. వైజాగ్ లో  జోన్ ట్రైనర్స్ ఎఫెక్టివ్ లీడర్, నిజాంబాద్ లో స్పీచ్ క్రాఫ్ట్ లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ లీడర్, వరంగల్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ లీడర్ అవార్డులను అందుకున్నారు. ఎంసీఏ జర్నలిజంలో అప్పటి వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా మెరిట్ స్టూడెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. దళిత సామాజిక వర్గం హక్కుల సాధనకై పోరాడుతూనే తెలంగాణ ఉద్యమంలో తన పోలీసు ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకొని ఉద్యమంలో చేరిన ఆయనకు గత ప్రభుత్వం దళిత రత్న అవార్డును కూడా అందజేసింది. ఇక ఆపదలో ఎవరున్నా… తానున్నానంటూ.. ముందు నిలిచి చేయూత అందివ్వడంలో తన తర్వాతే మరెవరైనా అన్నట్టు కోల్బెల్టు ప్రాంతానికి సుపరిచితుడుగా, ఆపద్బాంధవుడిగా ముందు వరుసలో ఉన్న దేవి లక్ష్మీ నరసయ్య సేవలను, ఆయనలోని గొప్పతనాన్ని గుర్తించిన హెచ్ ఎస్ ఎస్ సి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్