ఆప్త 15 సంవత్సరాల వేడుకలు గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్, అట్లాంటా మహా నగరం లో ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ వేడుకలకి దేశ విదేశాల నుంచి తెలుగు వారు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు పాలు పంచుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత ప్రభు మరియు సాయి ధర్మతేజ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చివరిగా రఘు కుంచె తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు, బొత్స సత్యనారాయణ, బండి సంజయ్ హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బంద్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర మరియు సంగీత విద్వాంసులు – కోటి, రఘు కుంచె, లిరిసిస్ట్- అనంత్ శ్రీరామ్. మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో కన్నులఁపండుగగా మొదలయ్యింది.