శ్రీకాళహస్తి ఆలయంలో “దివిటీలు” వెలిగేనా…,?
శ్రీకాళహస్తి జూలై 8
అర్హత లేని అధికారులను అందలం ఎక్కిస్తే అవకతవకలే జరుగుతాయి. అర్హత లేని వారే కీలకంగా వ్యవహరిస్తారనేది శ్రీకాళహస్తీశ్వరాలయానికి బాగా సరి పోతుంది. ఈ ఆలయానికి ఆర్జెసి సాయి అధికారి (రెవెన్యులో అయితే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్) ఇవోగా ఉండాలి. అయితే పలు కారణాల వల్ల అంతకన్నా తక్కువ స్థాయి అధికారులు ఈవోలుగా కొందరు చలామణి కావడం జరిగింది. తక్కువ స్థాయి కలిగిన వారైనా కొందరు సమర్ధంగా పనిచేశారు. మరికొందరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మెలిగారు. వారు చెప్పింది వేదం అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో అర్హత లేని సిబ్బందిని అందలం ఎక్కించారు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా పంచ కట్టుకొని ఎమ్మెల్యేలు… మంత్రులు.. హైకోర్టు న్యాయమూర్తులు… సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఆలయంలో ప్రోటోకాల్ విధులు నిర్వహించారు. దీంతో వారికి ఎక్కడలేని పరపతి పెరిగినట్లుగా భావించుకుంటున్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారిని ప్రోటోకాల్ విధులకు ఉపయోగించడంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండు రోజుల క్రితం జరిగిన అంతర్గత బదిలీల్లో అటువంటి వారిని ప్రాధాన్యత లేని (ఆదాయం లేని) విభాగాలకు బదిలీ చేయడం జరిగింది. ఆ విభాగాల్లో పని చేయడానికి వారు బహిరంగంగా విముఖత చూపుతున్నారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు సందర్భంగా దివిటీ పట్టడం…. టోల్గేట్ వసూళ్లు చేయడం… వాహనాలు నడపడం (డ్రైవర్లు) మొక్కల పెంపకం కోసం కేటాయించారు. దీంతో వారు అవమానానికి గురయ్యారు. ఇంతకాలం ఆలయంలో దర్జాగా వ్యవహరిస్తే ఇటువంటి విధులు నిర్వహించడమా? అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.గత ప్రభుత్వంలోని నాయకులతో రాసుకొని పూసుకొని తిరుగుతూ … బినామీ పేర్లతో వ్యాపారాలు చేయడం… అయ్యవార్ల వద్ద వసూళ్లు చేసి నాయకులకు ముట్టజెప్పి కమీషన్లు తీసుకోవడం… అడ్డదారుల్లో దర్శనాలు చేయించడం బాగా ఆర్జించడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ అధికారులకు తెలిసినా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇంతకాలం మంత్రులు, న్యాయమూర్తుల పక్కన తిరిగిన వీరు ఒక్కసారిగా దివిటీ పట్టడం.. వాహనాలకు డ్రైవర్గా వెళ్లడం.. నీళ్లు మోయడం… మొక్కలను సంరక్షించడం అంటే నామోషీగా భావిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి పైరవీలు ప్రారంభించారు. ఆ విధులు కాకుండా ఇతర విధులు కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఊరేగింపుల సందర్భంగా ఉచిత సేవకులు దివిటీలు పడుతున్నారు. కొత్తగా జరిగిన బదిలీల్లో దివిటీలు పట్టేందుకు విధుల్లో చేరతారా లేదా అనేది ఆలయంలో చర్చనీయాంశమైంది….
శ్రీకాళహస్తి ఆలయంలో “దివిటీలు” వెలిగేనా…,?
- Advertisement -
- Advertisement -