Saturday, April 12, 2025

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? :మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్

- Advertisement -

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా?
బండి సంజయ్, కిషన్ రెడ్డి కి టీపిసిసి అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్
హైదరాబాద్ ఏప్రిల్ 7

Are you ready to discuss what BJP has done to Telangana?: Mahesh Kumar Goud's challenge

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా?బండి సంజయ్, కిషన్ రెడ్డి కి టీపిసిసి అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భావన లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రాధేయపడుతున్నారు  11 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏం ఉద్దరించారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లౌకిక వాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరు అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ గురించి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని, పదేళ్లలో బంగారం లాంటి ప్రభుత్వ భూములను బిఆర్ఎస్ అమ్మితే బీజేపీ నేతల కళ్ళు మూసుకుపోయయా  బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చేల తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులు మోసిన ఘటన మరిచిపోయారా మోడీ, అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడు   బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పంపిణీని చేయాలని డిమాండ్ చేస్తున్నా విభజన హామీల గురించి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏనాడైనా మాట్లాడారా?అని అన్నారు. ప్రధాని మోదీ  దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు  ప్రపంచంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్  కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా తెలంగాణపై వివక్ష చూపుతూ అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంది.  బీసీల గురించి మాట్లాడటానికి తెలంగాణ బీజేపీ బీసీ నేతలు ఎందుకు మాట్లాడరు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రంలో చట్టబద్దత కల్పించి మీ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.   కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి..బీజేపీ పార్టీలో లాగా నియంత విధానాలకు కాంగ్రెస్ పార్టీలో ఆస్కారం లేదు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో సహకరించడానికి గ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణలో మతతత్వ బీజేపీకి అధికారం పగటి కలనే భావోద్వేగాలను రెచ్చగొడుతూ లౌకికవాదానికి తిలోదకాలిస్తున్న బీజేపీకి తెలంగాణలో చోటే లేదు.తెలంగాణలో మతం పేరుతో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు గుండు సున్నా  ఢిల్లీ ఎన్నికల కోసం యుమన నదికి నిధులు కేటాయించారు  హైదరాబాద్ మెట్రో, మూసి రివర్ ను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు విభజన హామీలు నెరవేర్చలేదని మీకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలు, నిధుల విడుదలలో అన్యాయం చేస్తున్నందుకు మీకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలా..?        రాష్ట్రానికి 11 ఏండ్లుగా అన్నింట్లో గుండు సున్నా ఇస్తున్నందుకు మీకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలా..?  కేంద్రం రాష్ట్ర అభివ్రుది గురించి పట్టించుకోకపోయినా ఉన్నంతలో అభివృద్ధి చేసి తీరుతాం దేశంలో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాల వల్లించినట్టుగా ఉంది.   బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని చెబుతున్న మీరు తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన కులగణను ఆదర్శంగా తీసుకొని దేశావ్యాప్తంగా కులగణన చేపట్టి మీ నిజాయతీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.  సంఖ్యా బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎవరి అండ చూసుకుని బీజేపీ పార్టీ అభ్యర్ధిని  నిలబెట్టింది మాకు సంఖ్యా బలం లేకపోవడంతోనే అభ్యర్ధిని నిలబెట్టేలేదు..మద్దతు ఇచ్చే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు  Hcu భూముల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్