మెయినాబాద్ లో దారుణం

- Advertisement -

మెయినాబాద్ లో దారుణం

Atrocity in Moinabad

హైదరాబాద్, జనవరి 3, (వాయిస్ టుడే)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా థరూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం.. బతుకుదెరువు కోసం కొద్ది నెలల కిందట మొయినాబాద్‌కు వలస వచ్చింది.ఆ కుటుంబం మొయినాబాద్ పెద్ద మంగళారంలోని ఓ విధిలో అద్దెకు ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె (4) రం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన కైలాస్ (40) ఆ సమయంలో అటుగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కైలాస్.. ఆ బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన బాధితురాలి అక్క.. వెంటనే వెళ్లి తన నాన్నకు జరిగిన విషయం చెప్పింది. ఆ తండ్రి వెంటనే వెళ్లి కైలాస్‌ను పట్టుకున్నాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు.. కైలాస్‌ను చితకబాదారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబం ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular