లక్నో, నవంబర్ 8, (వాయిస్ టుడే ): తమిళనాడులో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కోచ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కి వెళ్తున్న రైల్లో ఉన్నట్టుండి ఓ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. పల్స్ పడిపోయింది. ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం చేయాలో అర్థంకాక అలాగే ఉండిపోయారు. దాదాపు 600 కిలోమీటర్ల మేర ఆ డెడ్‌బాడీతోనే ప్రయాణించారు. మధ్యలో రైల్వే అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌కి వచ్చాక కానీ ఆ మృతదేహాన్ని రైల్లో నుంచి దింపలేదు. అప్పటి వరకూ అలా శవంతోనే ప్రయాణం చేశారు ప్యాసింజర్స్. యూపీలోని బండా జిల్లాకి చెందిన 36 ఏళ్ల రామ్‌జీత్ యాదవ్ చెన్నైలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా బండాకి తిరుగు ప్రయాణమయ్యాడు. నాగ్‌పూర్‌కి చేరుకునే సమయానికి మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఏమైందో అని గమనించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్‌కి చేరుకునే సమయానికే రైల్వే అధికారులకు ప్రయాణికులు సమాచారం అందించారు. డెడ్‌బాడీని తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేశారు. కానీ అధికారులెవరూ స్పందించలేదు. ఝాన్సీ స్టేషన్‌కి చేరుకున్నాక అప్పుడు ఆ మృతదేహాన్ని కిందకు దించారు.