నర్సాపూర్ : రెండు రోజుల్లోగా కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి బీఫామ్ తనకే ఇస్తుందని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాధి సంఖ్యలో నియోజకవర్గం కేంద్రమైన నర్సాపూర్ పట్టణానికి బుధవారం భారీగా తరలివచ్చారు. టీపిసిసి రాష్త్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి గారితో కలిసి నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ
నర్సాపూర్ నియోజకవర్గంలో మీ బిడ్డనై మీ ఇంటికివస్తున్న ఆశీర్వదించండి… నేను వేసే ప్రతి అడుగు నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే… నేను చేసే ప్రతి పని నర్సాపూర్ ప్రజల బాగు కోసమే అంటు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వేలాది మందితో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఓపెన్ టాప్ జీపుపై నిల్చోని ప్రజలకు అభివాదం ఆశేష జనవాహిని, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు గోండ్రు కళాకారులు బ్యాండ్ మేళా తాళాలతో వాయిద్యాలతో డప్పు చప్పుల మధ్య నర్సాపూర్ చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు బాణాసంచా శబ్దాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ లో ఎక్కడ చూసినా జనసంద్రంగా మారి కనిపించింది. ఈ దఫా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ నియోజకవర్గం మహిళ అధ్యక్షులు సుజాత నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వన్ కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ వెల్దుర్తి మండలం అధ్యక్షులు మహెశ్వర్ రెడ్డి హత్నుర మండలం అధ్యక్షులు క్రిష్ణ ముధిరాజ్ రుస్తుంపెట్ ఎంపీటీసీ అశోక్,చింతల్ చెరువు ఎంపీటీసీ భాస్కర్ సర్పంచ్లు నర్సాపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ హత్నుర మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం నర్సాపూర్ మండల ఉపాధ్యక్షుడు ఆకుల నర్సింలు మాజీ యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గం యుత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అట్టహాసంగా నర్సాపూర్ గాలి అనిల్ కుమార్ నామినేషన్
- Advertisement -
- Advertisement -