ప్రతిమ హాస్పిటల్ సేవలను వినియోగించుకోండి
Avail services of Pratima Hospital
ఆసుపత్రి ఉచిత బస్సు పునరుద్ధరణ
కమాన్ పూర్
కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కే. కౌశిక్, అసిస్టెంట్ మేనేజర్ రాజేందర్ లు కోరారు. శనివారం రామగిరి మండలంలో పలు గ్రామాలలో మార్కెటింగ్ టీం పర్యటించి ఆసుపత్రి సేవల గురించి తెలియజేశారు.మంథని పరిసర ప్రాంత ప్రజలకు గత కొద్ది రోజులుగా ప్రతిమ ఆసుపత్రి ఉచిత బస్సు నిలిపివేయడం జరిగింది. తిరిగి ఈ నెల 26 వ తేదీ నుండి పునరుద్ధరించబడిందని తెలిపారు.. కావున ప్రతిమ ఆస్పత్రి ఉచిత బస్సులో వచ్చే పేషెంట్లు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మంథని ఫైర్ స్టేషన్ వద్దకు రాగలరు. తమ వెంట రేషన్ కార్డు తెలుపు కార్డు తీసుకొనిరాగలరు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సదానందం 9705309496, పౌండేషన్ రాజు కుమార్ 6281840860 నంబర్లను సంప్రదించగలరని తెలిపారు. ప్రతిమ హెల్త్ ప్యాకేజీల కింద తల్లి బిడ్డ సంరక్షణ పథకం, గ్యాస్ట్రోఎంటరాలజీ హెల్త్ ప్యాకేజ్, హార్ట్ హెల్త్ ప్యాకేజ్, డయాబెటిక్ హెల్త్ ప్యాకేజ్, యూరాలజీ హెల్త్ ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మెడికల్ సౌకర్యం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రెస్ క్లబ్ నాయకులు పీవీరావు, కొండ్ర సుకుమార్, కాపర్తి అభిలాష్, స్థానిక నాయకులు బుడిగే క్రాంతి,ఒర్రె సురేష్, చిలువేరివెంకటేష్,ప్రతిమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జనగామ. సదానందం,నాగరాజు, రాజకుమార్,సైయ్యదు హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.