మోటారు‘బండి’ఎక్కి…గల్లీగల్లీ తిరుగుతూ..
చిన్నారులతో ఆడుతూ…పెద్దలకు రంగులు పూస్తూ…
హోలీ సంబురాల్లో మునిగితేలిన బండి సంజయ్
పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో హోలీ సంబురాలు
హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయం సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కన్పించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబురాలు జరుపుకున్నారు.
ఇక చిన్నారులు, స్కూల్ విద్యార్థులో హులీ వేడుకల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హోలీ పర్వదిన శుభుకాంక్షలు తెలిపారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగు రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలుసహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.