- Advertisement -
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట తప్పుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇవాళ ఫిబ్రవరి 2 ఆ ప్రస్తావనే లేదు. కనీసం నోటిఫికేషన్ అయినా ఇవ్వలేదు. మీరు ఎంతో పవిత్రంగా భావిస్తాం అని చెప్పే మేనిఫెస్టోను మీరే అమలు చేయకపోతే ఎలా? కేవలం ఎన్నికల వరకు మాత్రమే మేనిఫెస్టో మీకు పవిత్ర గ్రంథమా? ఎన్నికలయ్యాక కాదా? ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
- Advertisement -