సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా వుండాలి

- Advertisement -

 సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా వుండాలి
మంత్రి పొంగులేటి
ఖమ్మం

Be alert for seasonal diseases

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవిన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ మాలతితో కలిసి విషజ్వరాలతో బాధ పడుతున్న స్టానిక రోగులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, చికిత్స పొందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో విస్తృతంగా తిరిగి గ్రామంలో ఉన్న బురద రోడ్డులు, సైడ్ కాలువలు పరిశీలించి నీళ్ళు నిల్వ ఉండకుండా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీ తాను అండగా ఉంటానన్నారు.వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు.సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాదుల గురించి వారికి అందించాల్సిన సేవల గురించి డిఎంఅండ్ఓకి దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular