గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుందరీకరణ పనులకు శ్రీకారం
Beautification work started at Godavarikhani Government Degree College
ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని:
గోదావరిఖని స్థానిక 6వ. డివిజన్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీకారం చుట్టారు.
గోదావరిఖని నగరంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం డిగ్రీ కళాశాలకు చెందిన ప్లే గ్రౌండ్ మొత్తం కేటాయించడం వలన కళాశాల విద్యార్థులకు ఆట స్థలం కొరత ఏర్పడినట్లు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కళాశాల ఆవరణం మధ్య నుండి ప్రవహిస్తున్న మురికి కాలువ డైవర్షన్ పనులు, విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కోసం ఆర్. ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం కళాశాల ప్రిన్సిపాల్ డా. జై కిషన్ ఓఝా తోటి అధ్యాపక బృందంతో కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి అందజేసారు.
కళాశాల ప్రిన్సిపాల్ అర్జీ పత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సత్వరమే స్పందించి సంబందిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఇదే రోజు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సుందరీకరణ పనులను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళీ స్వామి స్వయంగా పర్యవేక్లిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. జై కిషన్ ఓఝా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి, కార్పొరేటర్ మహంకాళి స్వామి కి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముస్తఫా, ఇతర నాయకులు కాంపెల్లి సతీస్, పాతిపెల్లి ఐలయ్య, గట్ల రమేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏ. సాంబశివరావు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా. సుబ్బారావు, సీనియర్ అధ్యాపకులు ఎన్. సి. సి. లెఫ్టినెంట్ బి. తిరుపతి, పి. సవిత, ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్లు డా. నరేష్, డా. కిరణ్మయితో పాటు డా. శారద, డా. శంకరయ్య, పి. శ్రీదేవి, డా. సురేష్, వి. ఆంజనేయులు, డా. అజయ్ కుమార్, డా. రామకృష్ణ, డా. నరేష్, డా. స్రవంతి, కే. అరుణ, ఎస్. సారయ్య, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, ఎన్. ఎస్. ఎస్. వాలంటీర్లు, ఎన్. సి. సి. కాడేట్స్ పాల్గొన్నారు.