జనసేన తెలంగాణ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు

- Advertisement -

జనసేన తెలంగాణ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు

ఎన్డీఏ కూటమి ఘన విజయం.. జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం

హైదరాబాద్, నవంబర్ 3 (వాయిస్ టుడే):

Victory celebrations at the Jana Sena Telangana office

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం, జనసేన పార్టీ అద్భుత ప్రదర్శనతో తెలంగాణలోని జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూటమి విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కూటమి పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన విజయాల స్ఫూర్తితో తెలంగాణలోనూ జనసేన పార్టీ విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయానికి రామ్ తాళ్లూరి చేసిన కృషి కూడా కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధిస్తున్న విజయాలు తెలంగాణలో పార్టీ సంస్థాగత విస్తరణకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసమే ఈ విజయానికి ప్రధాన కారణమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, ప్రజీత్ గౌడ్, మేడ రామకృష్ణ, నరేష్, మాధవరెడ్డి, ఎడమ రాజేష్, నందగిరి సతీష్, గోకుల రవీందర్ రెడ్డి, నిహారిక నాయుడు, లిఖిత, తనూజ రెడ్డి, జై సింహ పడాల, సుదర్శన్ రెడ్డి, మేడ మురళీకృష్ణ, అనిల్ కుమార్, వేముల మహేష్, జెంజి పోగుల ప్రవీణ్, అజయ్ తదితర జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular