Monday, April 6, 2026

రేషన్ బియ్యం తరలించడంవేనుక పెద్ద మాఫియా–వైఎస్ షర్మిలా రెడ్డి

- Advertisement -

రేషన్ బియ్యం తరలించడంవేనుక పెద్ద మాఫియా–వైఎస్ షర్మిలా రెడ్డి

Big mafia for moving ration rice--YS Sharmila Reddy

విజయవాడ
రాష్ట్రంలో పిడిఎస్  రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా.  ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల ఆన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది.

కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ ? మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయాజాలమా ?  అనునిత్యం  తనిఖీల సంగతి ఏంటి ? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు.
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి.  లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తో విచారణ జరిపించాలి.  ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ. ధాన్యాగారానికి భాండాగారం.  ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు.  ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే, బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు. ఇది మన రాష్ట్ర దుస్థితి అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్