Sunday, September 8, 2024

మెదక్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ చేరిక

మెదక్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరారు.  ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి  గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవు. ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. మెదక్ పుకార్లు తిప్పికొట్టాలి. హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి.  ఎమ్మెల్యే పద్మ ఎంతో కృషి చేస్తున్నారు. ఇందిరాగాంధీ  మాట తప్పారు. కానీ సీఎం కేసీఆర్  వల్ల, పద్మ  వల్ల మెదక్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ వచ్చింది. రైల్ వచ్చింది. ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు. రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది కేసియర్. కరెంట్ నిరంతరం ఇస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా.. గెలిచేది బి ఆర్ ఎస్సే

పండుగల వేళ ఎన్నికల పండగ వచ్చింది. రకరకాల వ్యక్తులు వస్తున్నారు. దండగ అన్న వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్. పెట్టు బడి నాడు రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నామని అన్నారు. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.  3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా, 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదు. కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం. కిసాన్ సమ్మన్ నిధి, హర్ ఘాట్ జల్, కళ్యాణ లక్ష్మి, ముగ జీవాలకు అంబులెన్స్.. కేంద్రం మనవి కాపీ కొట్టి అమలు చేస్తున్నది.  నాడు బెంగాల్ ఉండేది. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి. పద్మ గెలుపు , మెదక్ అభివృద్ధికి మలుపు. జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలని అన్నారు.

Big shock for Congress party in Medak district
Big shock for Congress party in Medak district

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్