బైక్ దొంగ అరెస్ట్… (క్రైమ్ )
మేడిపల్లి: ఫిబ్రవరి 01 (వాయిస్ టుడే) : దొంగని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రైమ్ ఎస్ ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ లో ఓ బైకెను దొంగిలించి తీసుకు పోతుండగా బైక్ ఓనర్ పట్టుకుని స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందుతున్ని పోలీస్ స్టేషనకు తరలించారు.నిండుతుడు గొనె నాగరాజు తండ్రి ఏసు పాదం, చింత పాలెం, మల్లేపల్లి , గుంటూరు కి చెందిన నిందుతున్ని విచారించి కేసు నమోదు చేసారమని గతంలో కూడా నిందితుడు పలు కేసులలో ఉన్నట్లు పోలీసులు విచారణలో తెల్చారు.నిందుతునిపై కేసు నమోదు చేశామని శుక్రవారం రిమాండ్ కు తరలిస్తామని ఎస్ ఐ లక్ష్మణ్ తెలిపారు



