హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బిజెపి కుట్ర చేస్తుంది
రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీమంత్రి పుష్పలీల
హైదరాబాద్ జూన్ 17 (
సెక్యులర్ దేశమైన భారత దేశం లో అన్ని మతాలకు , వర్గాలకు సమాన హక్కుకున్నాయని,కాని జంతు బాలి నిషేధం పేరుతో ఒక బ్వర్గం వారు ఎంకోవర్గం వారిపై దాడులకు పాల్పడట పట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీమంత్రి పుష్పలీల ఆందోళన వ్యక్తం చేసారు.ఎందుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్న మేమేదాక్ లో జరిగిన సంఘతననే నన్నారు.సోమవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఇట్టి దాడులకు బిజెపి పార్టీ అండగానిలిచి హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బిజెపి కుట్ర చేస్తుందని ఆరోపించారు.వీరి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుస్పలీల హెచ్చరించారు. విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని కేసీఆర్ కు భయం పట్టుకుందని అన్నారు.ఫోన్ ట్యాపింగ్,విద్యుత్ అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాల లో పెట్టి ఇక్కడికి రానియ్యకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు.కూతురు కవిత కూడా నాకు భయం అవుతుందని జైల్లో ఏడ్చిందని వాళ్ళ నాయకులే చెప్తున్నారని తెలిపారు.నన్ను ప్రధాన మంత్రి ని చెయ్యమని కాళ్ళు మొక్కి మోడీ అధికారంలోకి వచ్చిండని ఎద్దేవా చేసారు.దమ్ముంటే ఈవీఎంలు లను తీసేసి ఎన్నికలకు వెళ్ళమని రాహుల్ గాంధీ చెప్పారని,కానీ ఈవీఎం లను నమ్ముకొని గెలిచిండు మోడీకి ఆ ధైర్యం లేదన్నారు.ఉక్రెయిన్ ప్రధాని ఎలెన్ మాస్క్ కూడా ఈవీఎంల తో అత్యంత ప్రమాదం అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా పుష్ప లీల గుర్తు చేసారు.చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఈవీఎం కారణమని చెప్పి మరీ ప్రూవ్ కూడా చేశాడన్నారు.తెలంగాణలో బిజీపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.తెలంగాణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుందని,రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బిజెపి కుట్ర చేస్తుంది; కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీమంత్రి పుష్పలీల
- Advertisement -
- Advertisement -