- Advertisement -
దేశంలో బిజెపి ప్రాధాన్యత కోల్పోయి సన్నగిల్లుతోంది
BJP is losing its importance in the country
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ నవంబర్ 27
దేశంలో బిజెపి ప్రాధాన్యత కోల్పోయి సన్నగిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం గాంధీభవన్ లో చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ పార్టీ ప్రభావం ప్రజలలో బలంగా నాటుకుందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకిఅనుకూలమైన వాతావరణం మేలుకొని ఉందని అన్నారు. ఆరు గ్యారెంటీ లో అమలు జరిపేందుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. రైతు భరోసా సంబంధించిన విషయాల్లో అన్న విధాల కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా 18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని ఆయన అన్నారు. రెండు లక్షల రుణమాఫీలో కుటుంబాల వారిగా రేషన్ కార్డు ఆధారంగా పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. రేషన్ కార్డు లేని వారికి సంపూర్ణంగా సర్వే చేసి దాని ఆధారంగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. అడ్డు గోలుగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవ్య చేశారు. రైతాంగ గా సోదరులు ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాను స్పష్టం చేశారు. పద్ధతి ప్రకారం రైతులకు వెసులుబాటు కలిగించేందుకు ప్రయత్నంలో ఉన్నామని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల కు న్యాయం చేయాలన్నది తమ ధ్యేయమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తూనే కుల గణన శ్రీకారం చుడుదామని తమ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి ఉటకించారు. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. 6 గ్యారంటీలకు అమలు చేసేందుకు అడ్డంకులు సృష్టించిన ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రం మీద అప్పుల భారం మోపి బిఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసి వెళ్ళిపోతుందని అన్నారు. ఫుడ్ పాయిజన్ విషయాలపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఘాటైన విషయం ప్రస్తావించిన సంగతి ఓ విలేఖరి ప్రశ్నించగా ఈ వ్యవహారాల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి మంత్రి పనిమంతుడే అని నిస్సహాయులుగా ఉన్నవారు లేరని ఆయన చెప్పుకున్నారు. మూసి ప్రక్షాణాల వల్ల నగరానికి. మ ణిహారంగా మారనున్నదని అన్నారు.కుల గణన జరిపించొద్దని వాస్తవాలు బయటికి రావద్దని కొంతమంది వ్యక్తులు నిందారోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -