*హౌసింగ్ బోర్డులో గడపగడపకు బిజెపి ఎన్నికల ప్రచారం* జడ్చర్ల మున్సిపాల్టీ హౌసింగ్ బోర్డు, విద్యానగర్ కాలనీల్లో 8,9వార్డు పరిధిలోని బూత్ నెంబర్లు 145,148లో పాలమూరు బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి డీకే అరుణకి మద్దతుగా గడప గడపకు తిరిగి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందజేసి బిజెపి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్రమ సంఖ్య నెంబర్1 పై కమలం పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జి బీ.రాజశేఖర్ రెడ్డి, ఉల్చకోటి బాల్ రెడ్డి, శీలం రాఘవేందర్,శేఖర్ రెడ్డి, భీమ్ రాజ్,యేసయ్య, విశాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాము, రంజిత్ రెడ్డి, హబీబ్, తిరుపతయ్య, చందర్ నాయక్, గణేష్, నర్రా ప్రతాప్ రెడ్డి లతోపాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.