- Advertisement -
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం
హనుమకొండ
కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ (Hanamkonda News)కు వెళ్తుండగా.. ఎల్కతుర్తి శివారులో ఆర్టీసీ (TSRTC) బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంటపొలంలోకి బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. ఈఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలువరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్లోడ్ వల్లే బస్సు చక్రాలు ఊడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులు 80 మంది ఉండగా, పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
- Advertisement -