- Advertisement -
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది.
Botsa Satyanarayana’s brother ready to join Jana Sena
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
- Advertisement -




