ట్రెండింగ్ లో బాయ్ కాట్ టెర్కీ
న్యూఢిల్లీ,మే 14
Boycott Turkey is trending.
టర్కీపై భారతీయులు రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు డ్రోన్లు వంటి ఆయుధాలు సరఫరా చేయడమే కాదు..భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతోంది. దీంతో భారత్ టర్కీతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. టర్కీకి చెందిన న్యూస్ చానల్స్ ను నిషేధించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించుకుంది. వాణిజ్యాన్ని కూడా తగ్గించుకోవాలని డిసైడయింది. వ్యాపారులు ఇప్పటికే టర్కీ దిగుమతులకు దూరంగా ఉంటున్నారు. 2024లో టర్కీ నుండి భారతదేశం దిగుమతులు సుమారు 3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. భారతదేశం నుంచి టర్కీకి 7 బిలియన్ డాలర్లు ఎగుమతులు ఉన్నాయి. మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లు. టర్కీ నుండి యంత్రాలు, యాపిల్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేస్తుంది. భారత్ టర్కీకి పెట్రోలియం, ఆటో భాగాలు, వస్త్రాలు ఎగుమతి చేస్తుంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్‌కు టర్కీ డ్రోన్లు, సైనిక సాయం) కారణంగా భారతదేశంలో “బాయ్‌కాట్ టర్కీ” నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ బాయ్‌కాట్ ప్రభావం ప్రధానంగా టర్కీ యాపిళ్లపై కనిపించింది. టర్కీ యాపిళ్ల టర్నోవర్ ఒక సీజన్‌లో సుమారు 1000 నుంచి 1200 కోట్ల వరకు ఉంటుంది. బాయ్‌కాట్ కారణంగా దిగుమతులు తగ్గాయి. వ్యాపారులు ఇరాన్, న్యూజిలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుండి యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. భారత్ బాయ్ కాట్ టర్కీ నినాదం టర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. టర్కీ కరెన్సీ లిరాను స్థిరీకరించడానికి అధిక వడ్డీ ప్రభుత్వ బాండ్లపై ఆధారపడిన టర్కీ ఆర్థిక నమూనా అస్థిరంగా ఉంది. టర్కీ స్థూల విదేశీ మారక నిల్వలు దాదాపు 85 బిలియన్లు మాత్మే. అప్పులు , స్వాప్ ఒప్పందాలను లెక్కించిన తర్వాత, నికర నిల్వలు సున్నాకి దగ్గరగా లేదా ప్రతికూలంగా ఉంటాయని చెబుతున్నారు. అంటే చాలా స్వల్పమే వాస్తవ నిల్వలు ఉంటాయి. లిరాను డాలర్లుగా మార్చడం: 30 మిలియన్ల పౌరులు ఒక్కొక్కరు సగటున $500 మార్పిడి చేసుకుంటే, సెంట్రల్ బ్యాంక్ దాదాపు తక్షణమే $15 బిలియన్ల నిల్వలను కోల్పోతుంది. లిరా అపూర్వమైన పతనాన్ని ఎదుర్కొంటుంది. టర్కిష్ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం డిపాజిట్లలో దాదాపు $450 బిలియన్లను కలిగి ఉంది. కేవలం 5% మంది డిపాజిటర్లు భయాందోళనకు గురై తమ డబ్బును ఉపసంహరించుకుంటే, అది రోజుల్లోనే $22.5 బిలియన్లు పోతుంది, అందుబాటులో ఉన్న నిల్వలలో సగానికి పైగా తగ్గిపోతుంది.టర్కీ టూరిజంకు భారతీయుల కాంట్రిబ్యూషన్ ఎక్కువే. అక్కడ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు వెళ్తూంటారు. ఇప్పుడు చాలా మంది మానేసే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రవాద దేశానికి మద్దతు విషయంలో ప్రపంచదేశాలు..టర్కీని దూరం పెడితే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.