గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహం పై గుడివాడ II పోలీసులు మెరుపుదాడి.
ఈరోజు అనగా ది.08.07.2024 వ తేదీన ఉదయం గుడివాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో హరి నారాయణపురం లో ఆర్గనైజింగ్ వ్యభిచారం జరుగుతున్నట్లుగా వచ్చిన రహస్య సమాచారం మేరకు, గుడివాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారైన M. నాగ దుర్గారావు గారు స్టేషన్ సిబ్బందితో వ్యభిచార గృహం పై దాడి చేయగా తమిళనాడు కు చెందిన రాజా రాజాంగం అనే విటుడు, బాదితురాలితో పట్టుబడినాడు. ఇన్స్పెక్టర్ గారు వారిని విచారించగా నైనవరపు డేవిడ్, పోలుకొండ వెంకటేశ్వరరావు @ వెంకటేష్ అనే అతను కొద్ది రోజులుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. అంతట విటుడుని మరియు వ్యభిచార గృహం నడుచుటకు సహరిస్తున్న మేకా శ్రీను లను అరెస్ట్ చేయడమైనది. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నైనవరపు డేవిడ్, పోలుకొండ వెంకటేశ్వరరావు @ వెంకటేష్ పరారీలో వున్నారు ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు