- Advertisement -

మోదీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ తోలుబోమ్మలతో వినూత్న ప్రచారం
హైదరాబాద్: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ చేతిలో కీలుబోమ్మలని తెలియజేసేలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబోమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది.
- Advertisement -


