కొండాపూర్
16-11-2023

భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ గెలిచి, శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగురా వేయటం ఖాయం : కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పధకాలకు నేడు ప్రచార కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు: యువజన నాయకులు ఆదిల్ పటేల్.
కొండాపూర్ డివిజన్ లోని పాన్ మక్త, సాయి నగర్ దర్గా, రాధే నగర్, మస్తాన్ నగర్ లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ప్రతి గడప గడపకు తిరిగి బీఆర్ఎల్ ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ ని అఖండ మెజారిటీ గెలిపించాలని ఓటర్లను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అభ్యర్థించారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ,
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గడపకు ఒక సంక్షేమ పధకం అందిదని, సంక్షేమ పధకం అందని ఇల్లు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశ దిశ రూపం మార్చి, అభివృద్ధి పధంలో తీసుకోని వెళుతున్న ఘనత మన సీఎం కేసీఆర్ కి చెల్లుతుందని అన్నారు. గ్రామీణ, పట్టణ ఆర్ధిక వ్యవస్థలను మెరుగుపర్చి, ప్రజల జీవితాల్లో వారికీ భరోసా కల్పించిన ఘనత మన కేసీఆర్ దని అన్నారు. మునుపేన్నడు లేని విధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎటు చూసిన అభివృద్ధితో బాటుగా పట్టణ ప్రజల సౌకర్యాలను గూర్చి ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటి ఇంటికి మంజీరా మంచి నీటిని అందించే విధంగా కష్టపడిన గొప్ప నాయకులు మన గాంధీ అన్న ని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ ని అత్యధిక మెజారిటీ గెలిపించాలని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , యువజన నాయకులు ఆదిల్ పటేల్ , కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మీనా భి, కరీం లాలా, మల్లెల శ్రవణ్ యాదవ్, మహేష్ యాదవ్, సురేష్ యాదవ్, సాయి శామ్యూల్ కుమార్, దామోదర్, సోమరాజు, రవి శంకర్ నాయక్, తిరుపతి యాదవ్, సయ్యద్ ఉస్మాన్, డా. సుదర్శన్, పూజ, తంగమ్మ, సిద్ధూ, అజ్జు, నగేష్, బాబు, వసీమ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



