కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ శాసనసభ ఎన్నికల లిస్టును ప్రకటించింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రకటించారు. శ్రావణ మాసం పంచమి తిథి కావడంతో ఇదే మంచి ముహూర్తంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు వ్యుహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే.. స్పీడ్ పెంచిన రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు ప్రత్యేక కార్యక్రమాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. అయితే.. ఈ సారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్.. పక్కా ప్లాన్‌తో ఎన్నికలకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం గజ్వెల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి కూడా పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. వేములవాడలో ఎమ్మెల్యే పౌరసత్వం వివాదం నేపథ్యంలో మార్చాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని తెలిపారు. ఏడుగురు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎం చెప్పారు. ఉప్పల్, వేములవాడ, మెట్‌పల్లి, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా సిట్టింగ్ అభ్యర్థులను మార్చినట్లు ప్రకటించారు. జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి..ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సీట్లు పంచుకొని సందడి చేశారు.రు. వేముల వాడకు చల్మెడ లక్ష్మి నర్సింహారావుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. వేములవాడ టికెట్ నీకే అంటూ సీఎం ప్రకటన చేశారని, భారీ మెజారిటీతో విజయం సాధించాలని సూచించారు