- Advertisement -
శ్రీతేజను పరామర్శించిన బీఆర్ఎస్ బృందం
BRS team visited Sriteja
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చెప్పిన మాజీ మంత్రి టి .హరీష్ రావు నేతృత్వం లోని బీ ఆర్ ఎస్ నేతల బృందం పరామర్శించింది. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది.
హరీష్ రావు మాట్లాడుతూ .దురదృష్టకరమైన ఘటన లో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ సూచనతో బీ ఆర్ ఎస్ నేతలం పరామర్శించాం. శ్రీతేజ్ కోలుకుంటున్నారు ,వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారు. .శ్రీతేజ్ కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని అన్నారు.
.కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్క ర్ రావు నేతృత్వం లో శ్రీతేజ్ కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాట లో మరణించిన రేవతి కి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్ ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. వతి అందరి మనసు ను కరిగేలా చేసింది. .ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం ,మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ,ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రెవంత్ కొండారెడ్డి పల్లి లో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య కు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు ? రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పిలవరా ? సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు . ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలని అన్నారు.
- Advertisement -