Sunday, September 8, 2024

సబ్బండ వర్గాల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం

- Advertisement -

మా మద్దతు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి

పటాన్చెరు నియోజకవర్గ పద్మశాలీల ఏకగ్రీవ తీర్మానం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

వాయిస్ టుడే న్యూస్ పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళ్తూ, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పటాన్చెరు నియోజకవర్గ పద్మశాలి సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

శుక్రవారం పటాన్చెరులో ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏళ్లలో సాధించని ప్రగతిని దశాబ్ది కాలంలో చేసి చూపించిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత ముందుకు కొనసాగించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పద్మశాలీలకు స్వరాష్ట్రం సిద్ధించాక వారి జీవితాల్లో నవశకాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులు నేత కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వారికి తగిన నిధులు కేటాయించకుండా, రాయితీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు.

పరిశ్రమలను మూసివేస్తూ, సంఘాల నుంచి ఖరీదులు చేయకుండా కార్మికులను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. కానీ, బీఆర్‌ఎస్‌ సర్కారు నేతృత్వంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పద్మశాలీలకు సముచితస్థానం కల్పిస్తూ.. వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ఇందులో భాగంగా నేతన్నల కోసం ప్రభుత్వం ప్రత్యేక చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని వివరించారు. అలాగే, కార్మికులకు నూలు, రసాయనాలు, రంగుల్లో రాయితీలు ఇస్తూ నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నదని వెల్లడించారు. సంఘాల్లో ఉన్న రూ. 10 కోట్ల విలువైన స్టాక్‌ను కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంలోని పద్మశాలీలకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోని వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు మ్యాకాం మల్లేష్, పద్మశాలి సంఘం ప్రతినిధులు వేముల రమేష్, భాస్కర్, నర్సింలు, సోమదాసు, వీర నారాయణ, చిరంజీవి, నగేష్, విట్టల్ రాజు, నాగభూషణం, వాసు, గుర్రం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్