- Advertisement -
బడ్జెట్ ఎఫెక్ట్..
Budget effect..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర బడ్జెట్ సామాన్యులపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనివ్వగా మరికొన్ని వస్తువులపై భారాన్ని మోపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత బడ్జెట్ నేపథ్యంలో దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అలాగే, మరికొన్ని వస్తువుల ధరల కూడా భారీగా పెరగనున్నాయి.గత ఏడాది బంగారం, వెండి, ప్లాటినం, అనేక ఇతర వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని నిర్మలమ్మ తగ్గించారు. ముఖ్యమైన మార్పులలో మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ మందులు, కొన్ని ఖనిజాలపై సుంకాలు తగ్గించారు.అయితే, అధిక సుంకాల కారణంగా టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4 శాతానికి పడిపోతుందని అంచనా వేసిన నేపథ్యంలో బడ్జెట్ ప్రకటన వెలువడింది. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.ఆర్థిక మంత్రి ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం.. FY26లో భారత జీడీపీ 6.3-6.8 శాతం శ్రేణిలో పెరుగుతుందని అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవసరమైన దానికంటే చాలా తక్కువ. ఇలాంటి రంగాలలో నియంత్రణ సడలింపు, సంస్కరణలు అవసరం కూడా.ఆర్థిక మంత్రి వివిధ రంగాలపై ప్రభావం చూపేలా బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలు, మినహాయింపులలో కీలక మార్పులను నిర్మలమ్మ ప్రకటించారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, కీలకమైన ఖనిజాలు, ఈవీల తయారీ భాగాలు ధరలు తగ్గుతుండగా, ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు, కొన్ని టారిఫ్ లైన్‌లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
ఏది చౌకగా వస్తోంది? :
లైఫ్-సేవింగ్ డ్రగ్స్ : 36 ముఖ్యమైన ఔషధాలు ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు పొందాయి.
క్రిటికల్ మినరల్స్: కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, సీసం, జింక్‌తో సహా మరో 12 కీలకమైన ఖనిజాలను బీసీడీ నుంచి మినహాయించారు.
ఈవీ & మొబైల్ బ్యాటరీ తయారీ : ఈవీ బ్యాటరీ ఉత్పత్తికి 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు వస్తువులు బీసీడీ మినహాయింపు జాబితాలో చేరాయి.
షిప్ బిల్డింగ్: ఓడలు, వాటి భాగాలకు బీసీడీపై మినహాయింపు మరో 10 సంవత్సరాలు పొడిగించారు.
ఈథర్నెట్ స్విచ్‌లు: క్యారియర్ గ్రేడ్ ఈథర్‌నెట్ స్విచ్‌లపై బీసీడీ 20శాతం నుంచి 10 శాతానికి తగ్గింది.
ఓపెన్-సెల్ డిస్‌ప్లేలు : కస్టమ్స్ సుంకం 5శాతానికి తగ్గింపు.
ఫిష్ అండ్ సీఫుడ్ : ఫిష్ పేస్ట్‌పై కస్టమ్స్ సుంకం 30 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. ఫ్రీజ్ చేసిన చేపలపై ఇప్పుడు 5శాతం పన్ను ఉండగా 30శాతం నుంచి తగ్గింది. చేపల జలవిశ్లేషణ సుంకాలు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి.
లెదర్ : వెట్ బ్లూ లెదర్ ఇప్పుడు పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు పొందింది.
ఏది ఖరీదైనది? :
ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు : బేసిక్ కస్టమ్ డ్యూటీ 10శాతం నుంచి 20శాతానికి పెరిగింది. దాంతో టీవీలు, మొబైల్ ఫోన్‌లపై ప్రభావం తీవ్ర చూపుతుంది.
సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జ్ : ప్రస్తుతం సెస్‌లో ఉన్న 82 టారిఫ్ లైన్‌లపై మినహాయింపును ఎత్తేశారు.
టెలికాం పరికరాల ధరలతో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇందులో ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, సిగరెట్లు కూడా ఉన్నాయి.
చౌకగా మారిన వస్తువులివే :
మొబైల్ ఫోన్‌లు : మొబైల్ ఫోన్ బ్యాటరీ ఉత్పత్తి కోసం 28 అదనపు వస్తువులు మినహాయించిన మూలధన వస్తువుల జాబితాలోకి వస్తాయి. 36 ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించిన ఔషధాల జాబితాకు క్యాన్సర్ వంటి మందులు ఉంటాయి.
ఈవీ బ్యాటరీలు
వెట్ అండ్ బ్లూ లెదర్
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 క్రిటికల్ మినరల్స్
ఓపెన్ సెల్స్
ఎల్ఈడీ/ఎల్‌సీడీ
వైద్య పరికరాలు
షిప్‌ల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మరో 10 ఏళ్లపాటు మినహాయింపు అందిస్తోంది.
సముద్ర ఉత్పత్తులు
కోబాల్ట్ ఉత్పత్తులు
జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్
ఖరీదైనవిగా మారిన వస్తువులు
ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
అల్లిన బట్టలు
- Advertisement -