పట్టణంలో జోరుగా గుడుంబా విక్రయాలు చిద్రమై పోతున్న కుటుంబాలు

- Advertisement -
Busy Gudumba sales in the townBroken families
Busy Gudumba sales in the town
Broken families

రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఏరియాలో గుడుంబా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని సంసారంలో చిచ్చులు మొదలవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుడుంబాకు బానిసలై అనారోగ్యానికి గురై కొందరు, చిన్న వయస్సులోనే మరణించడం వారి కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి. కొందరు సింగరేణి ఉద్యోగులు సైతం గుడుంబాకు అలవాటు పడి ఉద్యోగాలు చేయడం లేదు. సారాకి బానిసలై ఏ పని పాట లేకుండా తిరుగుతూ సైకోలుగా మారుతూ రోడ్డున పోయే వాళ్లను సైతం బెదిరించి డబ్బులు అడగడం, బహిరంగంగానే రోడ్లపై గుడుంబా సేవించడం జరుగుతుంది. గతంలో పట్టణంలో పెద్ద ఎత్తున గుడుంబా అమ్మకాలు జరిగేవి అలాంటి సమయంలో తరచూ అబ్కారీ అధికారులు దాడులు చేస్తూ ఎప్పటికప్పుడు గుడుంబా తయారీ దారులను అమ్మేవారిని హెచ్చరిస్తూ గుడుంబా విక్రయాలను తగ్గించారు. వాటి నియంత్రణ ద్వారా వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది అని వెల్లడించడంతో పోలీస్ శాఖ వారి సహకారంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఉపాధి కోసం ప్రత్యామ్నయ మార్గాలు చూపించడంతో తయారీ తగ్గుముఖం పట్టింది. దానితో గ్రామాల్లో పట్టణంలో గుడుంబా అమ్మకాలు తగ్గాయి. చేసేది ఏమీ లేక ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవనాన్ని సాఫీగా సాగిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా గుడుంబా అమ్మకాలు జోరందుకున్నాయి తనిఖీలు చేయాల్సిన అబ్కారీ శాఖ అధికారులు సైతం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇక అబ్కారీ అధికారులతో కలిసి పనిచేయాల్సిన పోలీస్ అధికారులు కూడా వాటి అమ్మకాల నియంత్రణ గురించి దృష్టి సారించడం లేదు. మద్యం రేట్లు పెరగడం కూడా గుడుంబా తయారీ విక్రయిదారులకు కలిసి వచ్చింది, బెల్ట్ షాపుల నియంత్రణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గుడుంబా నియంత్రణపై కూడా దృష్టి సారించాలని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular