నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
అదనపు కలెక్టర్ పి.రాంబాబు
జగిత్యాల
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుధవారం రోజున మెట్పల్లి,మల్లాపూర్
,ఇబ్రహింపట్నం మండలాల్లోని రామారావు పల్లె,పెద్దాపూర్ ,ముత్యం పేట,గోదూర్
,ఇబ్రహింపట్నం,
అమ్మక్కపేట గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి నీ కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నీడ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆయన వెంట డీటీసీఎస్ ఉమాపతి ,తహసిల్దార్ లు తదితరులు ఉన్నారు.