- Advertisement -
వరద బాధితులకు సహాయం చేసిన కేబుల్ ఆపరేటర్లు
Cable operators helped flood victims
కేబుల్ ఆపరేటర్లను అభినందించిన ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల
నంద్యాల కేబుల్ ఆపరేటర్లు నంద్యాల కమ్యూనికేషన్ (సిటీ కేబుల్) , ఎమ్ఆర్ కేబుల్ ఆపరేటర్లు వరద బాధితుల కోసం 400 దుప్పట్లను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో విజయవాడకు పంపించడం జరిగింది .ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితుల కోసం తమ వంతు సహకరించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ వరద బాధితుల కోసం ఎంతో కొంత సహకరించాలన్నారు . అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతను తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు . ఆపద సమయంలో ఆదుకున్న వ్యక్తి దైవంతో సమానమన్నారు ఇప్పుడు మనకు సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని మన ఆంధ్రప్రదేశ్ ని మనమే అభివృద్ధి చేసుకోవాలన్నారు . అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి వరద బాధితుల కోసం ఎంతో కష్టపడుతున్నారు అన్నారు అలాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారం వారు చేస్తున్నారన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వరద బాధితులను పరామర్శించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తున్నారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
- Advertisement -