హీరో నాగార్జున పై మాదాపూర్ లో కేసు నమోదు!
హైదరాబాద్
Case registered against hero Nagarjuna!
టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులపై తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ టాఫిక్ ఇండస్ట్రీలోనూ .. పొలిటికల్ పరంగానూ చర్చనీయంగా మారింది. అక్కినేని నాగార్జున కుటుంబ పరువు రచ్చకెక్కింది. తాజాగా ఎవరూ ఊహించని విధంగా హీరో నాగార్జున పై మదాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఏం జరిగింది? తాజాగా తమ్మిడికుంట కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో నాగార్జునపై మాదాపూర్ పోలీసులుకేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడికుంట బఫర్ జోన్ లో ఉందని, సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. ఈ క్రమంలో హీరో నాగార్జున పై పోలీస్ కేసు పెట్టారనీ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు