- Advertisement -
గుంటూరు: కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సంగం డెయిరీ ముందు గొడవ జరగకపోయినా తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగం డెయిరీ.. వ్యక్తులతో ఒప్పందాలు పెట్టుకోదని,అలాగే పాల ధరలు వ్యక్తుల ఇష్టానుసారం నిర్ణయించడం జరగదని,సంస్థపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని,కిరాయి మనుషులతో డెయిరీ ముందు గొడవ చేయించారని,సంగం డెయిరీపై ప్రభుత్వం కుట్రకు తెర తీసిందని,ఇందులో భాగంగానే కొందరు పక్కా పథకం ప్రకారం దాడి చేయడానికి వచ్చారని , విధ్వంసానికి వచ్చిన వారిపై కాకుండా మాపై కేసులు పెట్టారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.
- Advertisement -