కేసులు… ఫిరాయింపులు
Cases… Deviations
విజయవాడ, జూలై 12
ఏపీలో అధికారం చేతులు మారాక… కొందరు వైసీపీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉండగా, చక్రం తిప్పిన నేతలు… నోటికి పని చెప్పిన నాయకులు…. ఇప్పుడు గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని. పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదేళ్లలో ఎలాంటి సౌండ్ చేసే వారో అందరికీ తెలిసే ఉంటుంది. ఏది మంచో… ఏదో చెడో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్ అయ్యారు కొడాలి నాని.అసెంబ్లీ, కేబినెట్ భేటీ, పబ్లిక్ మీటింగ్ ఇలా ఏదైనా సరే… వెనకా ముందు ఆలోచించకుండా… సీఎం చంద్రబాబుపై ఏకవచనంతో విరుచుకుపడిన కొడాలి నాని… ఇప్పుడు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఉమ్మడిగా టార్గెట్ చేయడంతో కొడాలి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది. దాదాపు 20 ఏళ్లుగా గుడివాడలో నిర్మించుకున్న సామ్రాజ్యం… ఒక్క గాలివానకు కూలిపోయినట్లు… గత ఎన్నికల్లో కూటమి సునామీతో కొడాలి కోట గల్లంతైంది. దీంతో కష్టాలన్నీ కూడబలుక్కుని కొడాలిని చుట్టుముడుతున్నాయి.తొలుత వలంటీర్లు, ఆ తర్వాత బెవరేజస్ గొడౌన్ గొడవలో ఓ లీజుదారు మాజీ మంత్రి కొడాలిపై కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న కొడాలిని.. ఇంకోవైపు నుంచి బియ్యం స్కాం కమ్మేస్తోందంటున్నారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో బియ్యం స్కాంపై తనిఖీలు చేస్తున్న అధికారులు ఉచ్చు బిగిస్తుంటే… ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇలా కేసులతో కుమ్మేయాలని ప్రభుత్వం చూస్తుంటే… స్థానిక ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తుండటం… మాజీ మంత్రికి షాకిస్తోందంటున్నారు.ఇరవయ్యేళ్