Monday, October 14, 2024

జార్ఖండ్‌ కొత్త సిఎం గా చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

జార్ఖండ్‌ కొత్త సిఎం గా చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం
రాంచీ ఫిబ్రవరి 2
జార్ఖండ్‌ ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయి సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ మంత్రిగా ప్రమాణం చేశారు.
హేమంత్ అరెస్ట్ నుంచి చంపయి ప్రమాణం వరకు..
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్‌ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు. ఆయన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. తీర్పు వెలువరించింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సోరెన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. సోరెన్ అరెస్ట్ కాగానే జేఎంఎం, కాంగ్రెస్‌కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తదుపరి సీఎంగా మంత్రి చంపయి సోరెన్‌కు మద్దతు తెలిపారు. శుక్రవారం గవర్నర్ సమక్షంలో సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్