సతీమణికి చీర కొన్న చంద్రబాబు
విజయవాడ, మార్చి 8, (వాయిస్ టుడే)
Chandrababu Naidu buys a saree for his wife
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు నిర్వహించిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అరటి వ్యర్ధాలతో తయారు చేసిన టోపీని ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు.మన మహిళలు విశ్వ విపణిపై రాణించాలి.. ప్రతి ఒక్కరూ ఆర్ధిక స్వావలంబన సాధించాలి.. ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి.. బహిరంగ ప్రదేశాల్లో వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి.. ఒక్క క్లిక్ తో.. వారి ముందు పోలీసులు నిలబడి సాయమందించాలి.. ఈ దిశగా ఒక మహిళా శక్తి యాప్.రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉండాలని, ఆర్ధిక శక్తిగా ఎదగాలనీ, జాతీయ- అంతర్జాతీయ వేదికలపైనా.. వీరు సత్తా చాటాలనే లక్ష్యంతో.. మహిళలకు అండదండలు అందించే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండున్నర లక్షల మందికి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చి పెట్టనున్నారు. అంతే కాదు మహిళల కోసం శ్రీశక్తి పేరిట ఒక కొత్త యాప్ రూపకల్పన చేశారు.దీంతోపాటు చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్ధాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అయితే అక్కడ నిర్వహించిన ఓ వస్త్ర దుకాణంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోసం చీర కొన్నారు. ఆ తర్వాత ఈ- వ్యాపారి పోర్టల్ డెలివరీని సీఎం ప్రారంభించారు.