Friday, December 27, 2024

నర్వ  మండల రూపురేఖలు మార్చండి

- Advertisement -

నర్వ  మండల రూపురేఖలు మార్చండి

Change the contours of the nervous system

పీహెచ్ సీలో తక్షణమే డాక్టర్ ను నియమించండి..!

ఫర్నీచర్ అందించండి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

నారాయణపేట
స్కూళ్లో మిడ్ డే మీల్ వంట పాత్రలు సమకూర్చండి
నారాయణపేట జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
ఎంపీ డీకే అరుణతో కలిసి నర్వ మండల కేంద్రంలో పర్యటన
బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
నారాయణపేట కలెక్టర్ తో కేంద్ర మంత్రి భేటీ:
సమగ్రత అభియాన్ లో భాగంగా ఎంపికైన ఆకాంక్షిత మండల కేంద్రం నర్వాను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నారాయణపేట జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అందులో భాగంగా నర్వా మండల కేంద్రంలోని రోడ్లును అభివ్రుద్ధి చేయడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని  కోరారు. దీంతోపాటు పీహెచ్ సీలో ఫర్నీచర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి నారాయణపేట జిల్లా నర్వా మండల కేంద్రంలో పర్యటించారు. నర్వ మండలాన్ని కేంద్రం ఆస్ప్రిరేషన్ బ్లాక్ ఆకాంక్షిత మండలం, గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నర్వ మండల కేంద్రంలోకి రాగానే వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి నీరాజనం పలికారు. వేలాది మంది వెంటరాగా వారితో కలిసి మండలం కేంద్రంలోని అంగన్ వాడీ సెంటర్ ను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రంలోని గర్భీణీలకు సీమంతం సందర్భంగా వారికి పండ్లను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రంలో మొక్కను నాటారు.
అక్కడి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ అక్కడ డాక్టర్ లేరని ప్రజలు చెప్పడంతో. తక్షణమే రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని ఆదేశించారు. పీహెచ్ సీలో కనీసం ఫర్నీచర్ కూడా లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు విన్నవించడంతో వెంటనే ఫర్నీచర్ ను సమకూర్చాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం బయటకు వచ్చిన సంజయ్ ను స్థానిక ప్రజలు కలిసి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం లేదని మొరపెట్టుకున్నారు. అక్కడి నుండి స్థానిక పాఠశాలను సందర్శించిన  బండి సంజయ్ అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. భోజనం ఎలా ఉందని అడిగారు. మధ్యాహ్నం భోజనం వండేందుకు వంట పాత్రలు లేవని నిర్వాహకులు చెప్పడంతో. వెంటనే వాటిని సమకూర్చాలని కలెక్టర్ ను కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సూచించారు.
అనంతరం  డీకే అరుణతో కలిసి బండి సంజయ్ నేరుగా నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కు విచ్చేశారు. కలెక్టర్ స్నిగ్ధ తో భేటీ అయ్యారు. ఆస్పిరేషనల్ బ్లాక్ గా నర్వ ఎంపికనైందున మండల కేంద్రం రూపురేఖలు మార్చాల్సిందేనని కోరారు. ముఖ్యంగా  గత 3 నెలల్లో యాంటినేటల్ కేర్ ఏ ఎన్ సి,  కోసం ఎంత మంది గర్భిణీ ప్రెగ్నెంట్స్, లను రిజిస్టర్ చేశారు? ఏయే గ్రామాలకు వెళ్లారు? ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత మంది పేర్లను రిజిస్టర్ చేశారు, 2024 ఫస్ట్ త్రైమాసికంలో స్టేట్ యావరేజ్ 88.7 శాతం, ఉంటే ఈ మండలంలో 77.1 శాతం మాత్రమే నమోదైంది. కారణాలేమిటి, అనే అంశంపై ఆరా తీశారు.
దీంతోపాటు బీసీ, షుగర్ టెస్టుల్లో, పోషకాహారం అందించడంలో, మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించడంలో కూడా 3 నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపుతున్నారు. ఎట్లా సాధ్యమైంది, మీరు తీసుకున్న చర్యలేమిటి? అట్లాగే భూసార పరీక్షల శాంపిల్స్ తీసుకోలేదని మీ రిపోర్ట్ లో ఇచ్చారు. కొన్ని బ్లాకుల్లో శాంపిల్స్ తీసుకున్నారు కదా, మీరెందుకు సేకరించలేకపోయారు, అనే అంశంపై అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు.అనంతరంర సమగ్రతా అభియాన్, కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఉద్దేశించి నర్వ మండల కేంద్రంలో ప్రజలు తనతో మొరపెట్టుకున్న సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్