రెవెన్యూ డివిజన్ గా  చెన్నూరు

- Advertisement -

మంచిర్యాల జిల్లా:అక్టోబర్  : చెన్నూరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్​ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.  మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ మంచిర్యాల పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు చెన్నూరు రెవెన్యూ డివిజన్ తో పాటు నియోజకవర్గంలోని అస్నాద్, పారుపల్లి కొత్త మండలాలుగా ప్రకటిస్తూ జీవో విడుదల చేశారు. దీంతో చెన్నూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ ఉత్తర్వులతో నెరవేరింది.

రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. కొత్త రెవెన్యూ డివిజన్ తో పాటు రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేయడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అత్యంత లాభం చేకూర్చనుంది.  దశాబ్దాల కల నెరవేర్చినందుకు చెన్నూరు నియోజకవర్గం ప్రజల పక్షాన ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ నేత ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు…

chennuru-as-revenue-division
chennuru-as-revenue-division
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular