పింఛన్ నామినీలుగా ఉద్యోగినుల పిల్లలు
జగిత్యాల
:భర్త నుంచి వేరుగా ఉండే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అస్సోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
తెలిపారు.ఈ ఉత్తర్వుల మేరకు కుటుంబ పింఛన్ కోసం నామినీలుగా ఇకపై తన పిల్లలను పేర్కొనవచ్చని తెలిపిందని వివరించారు.కేంద్ర సివిల్ సర్వీసెస్ (పింఛన్)నిబంధనలు -2021 లోని 50వ క్లాజు ప్రకారం ప్రభుత్వ
ఉద్యోగి లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్ దారు మరణించినప్పుడు ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి కుటుంబ పింఛన్ కు అనర్హులైనప్పుడు లేదా చనిపోయినప్పుడు కుటుంబ పింఛన్ ఇతర సబ్యులకు
అందుతుందని వివరించింది.అయితే తాజాగా ఈ నిబంధనలు మారుస్తూ మహిళా ఉద్యోగులు కుటుంబ పింఛన్ కు నామినీలుగా భర్త కంటే ముందుగా సంతానాన్ని పేర్కొనేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు
జారీచేసినట్లు కేంద్ర పింఛను,పింఛన్ దారుల సంక్షేమ విభాగం పేర్కొంది. తాజా సవరణ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి విడాకుల పిటిషన్ ,గట్టం కింద కేసులను దాఖలు చేసిన అన్ని సందర్భాల్లో ఆమె భర్త కంటే
ముందు అర్హత ఉన్న బిడ్డకు కుటుంబ పెన్షన్ ను పంపిణీ చేయడానికి అనుమతినిస్తుందని తాజా నిబంధనలు,సవరణ వివరాలను హరి ఆశోక్ కుమార్ తెలిపారు.