చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 మార్చి 27న ఎన్విఆర్ సినిమాస్ ద్వారా తెలుగులో గ్రాండ్ రిలీజ్
Chiyaan Vikram Veera Dheera Sooran Part 2 to have a grand release in Telugu on March 27th through NVR Cinemas
చియాన్ విక్రమ్ మోఎస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు.H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.చియాన్ విక్రమ్-దర్శకుడు S.U. అరుణ్ కుమార్-నిర్మాత రియా శిబుల అద్భుతమైన అద్భుతమైన కొలాబరేషన్ లో వస్తున్న వీర ధీర సూరన్ పార్ట్ 2 పై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులలో చాలా అంచనాలు వున్నాయి.